సభలు సమావేశాలు : 2016, ఆగస్టు - 25 ఛాయాచిత్రాలు
తెలుగుభాగవతం.ఆర్గ్ - తృతీయవార్షికోత్సవము చిత్రమాలిక
1. చి. భావన కృష్ణగీతాలకు చేసిన అందమైన నాట్యాలతో సభాసదులను అలరించిన ఒక నాట్యభంగిమ.

2. శ్రీ బండి శ్రీనివాస్ సభా ప్రారంభము చేయుట.

3. తెలుగుభాగవతం.ఆర్గ్ - తృతీయవార్షికోత్సవము
శ్రీ వేంకట కణాదగారి అమృతగాత్రంలో పద్యపఠనం.

4.తెలుగుభాగవతం.ఆర్గ్ - తృతీయవార్షికోత్సవము
తాళ్ళపాక అన్నమాచార్య వంశస్థులు, తిరుమల ఆస్తాన అన్నమయ్య కీర్తనలు ఆలాపించువారు శ్రీ హరినారాయణ స్వామి వారి చేతులమీదుగా ఆవిష్కరించిన శ్రీ "నారసింహ విజయం" ఆండ్రాయిడ్ చరవాణి ఆప్పు.

5. తెలుగుభాగవతం.ఆర్గ్ - తృతీయవార్షికోత్సవము
పోతన భాగవతజయంతి సందర్భంగా జరిపిన కృష్ణాష్టమి పోటీలలో క్విజ్ లో ప్రథమురాలిగా ఎన్నుకోబడి, ప్రముఖ కవి, సినిమా నటుడు శ్రీ తనికెళ్ళ భరణి గారి అమృత హస్తాలతో జ్ఞాపిక, ప్రశంసా పత్రం, నగదు బహుమతులను అందుకుంటున్న చి. "కె. జాహ్నవి సావిత్రి".
6. తెలుగుభాగవతం.ఆర్గ్ - తృతీయవార్షికోత్సవము
పోతన భాగవతజయంతి సందర్భంగా జరిపిన కృష్ణాష్టమి పోటీలలో క్విజ్ లో ద్వితీయురాలిగా ఎన్నుకోబడి, ప్రముఖ కవి, సినిమా నటుడు శ్రీ తనికెళ్ళ భరణి గారి అమృత హస్తాలతో జ్ఞాపిక, ప్రశంసా పత్రం, నగదు బహుమతులను అందుకుంటున్న చి. "డి. అశ్విత,", గుంటూరు.
7. పోతన భాగవతజయంతి సందర్భంగా జరిపిన కృష్ణాష్టమి పోటీలలో వ్యాసరచనల పోటీల లో ద్వితీయునిగా గెలిచి; ప్రముఖ కవి, సినిమా నటుడు శ్రీ తనికెళ్ళ భరణి గారి అమృత హస్తాలతో జ్ఞాపిక, ప్రశంసా పత్రం, నగదు బహుమతులను అందుకుంటున్న చి. "పిఎస్ఆర్ కె ప్రసాదు".
8. పోతన భాగవతజయంతి సందర్భంగా జరిపిన కృష్ణాష్టమి పోటీలలో వ్యాసరచనల పోటీల లో ప్రథమురాలిగా గెలిచి; అన్నమాచార్య వంశస్థులు శ్రీ హరినారాయణ స్వామి వారి అమృత హస్తాలతో జ్ఞాపిక, ప్రశంసా పత్రం, నగదు బహుమతులను అందుకుంటున్న చి. "చాగంటి సాయి తేజ".
9. పోతన భాగవతజయంతి సభ ఆరంభం సందర్భంగా చక్కటి కృష్ణుని ప్రార్థన ఆలపించినందుకు; ప్రముఖ కవి, సినిమా నటుడు శ్రీ తనికెళ్ళ భరణి గారి అమృత హస్తాలతో జ్ఞాపిక, అందుకుంటున్న చిన్నారి "చి. వేద".
10. పోతన భాగవతజయంతి సందర్భంగా కృష్ణగీతాలకు మనోరంజకంగా నాట్యాలు చేసి సభాసదులను అలరించినందుకు, ప్రముఖ కవి, సినిమా నటుడు శ్రీ తనికెళ్ళ భరణి గారి అమృత హస్తాలతో జ్ఞాపిక, ప్రశంసా పత్రం, నగదు బహుమతులను అందుకుంటున్న చి. "కె. జాహ్నవి సావిత్రి".
11. సభావేదికను ఎక్కుతూ సభకు నమస్కరిస్తున్న భాగవత గణనాధ్యాయి.

12. సన్మానము జ్ఞాపికలు స్వీకరించి మమ్ము ఆనందింప జేస్తున్న మాన్యులు ప్రముఖ సినీ నటులు, రచయిత ఆచార్య శ్రీ తనికెళ్ళ భరణి గారు..

13. సన్మానము జ్ఞాపికలు స్వీకరించి మమ్ము ఆనందింప జేస్తున్న మాన్యులు తిరుమల ఆస్తానంలో అన్నమాచర్య కీర్తనలు ఆలపించు స్వామి, శ్రీ తాళ్ళపాక హరినారాయణ స్వామి.

14. సన్మానము జ్ఞాపికలు స్వీకరించి మమ్ము ఆనందింప జేస్తున్న మాన్యులు ప్రముఖ ప్రవచనాచార్యులు, పుష్పగిరి పీఠ ఆస్థాన భాగవతులు ఆచార్య శ్రీ ప్రభల సుబ్రహ్మణ్యం గారు..

15. మాన్యులు తిరుమల ఆస్తానంలో అన్నమాచర్య కీర్తనలు ఆలపించు స్వామి, శ్రీ తాళ్ళపాక హరినారాయణ స్వామి వారితో భాగవత గణనాధ్యాయి.

16. మాన్యులు తెలుగుభాగవతం.ఆర్గ్ వ్యవస్తాపక అధ్యక్షులు, తెలుగు భాగవత ప్రచార సమితి వ్యవస్తాపక అధ్యక్షులు, భాగవత గణనాధ్యాయి. భాషణం
