పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సభలు సమావేశాలు : 2017 - చతుర్థ వార్షికోత్సవాలు, హైదరాబాదు

2017 భాగవత జయంత్యుత్సవములు; కృష్ణాష్టమి;తెలుగుభాగవతం,ఆర్గ్ చతుర్థ వార్షికోత్సవములు.
హైదరాబాదు వేదిక వివరాలు, ఆ చిత్రాలసరళి:-- ఈ ఏడాది ఉత్సవాలు మా నల్లనయ్య అనుగ్రహంతో నాలుగు కేంద్రాలలో (అ) హైదరాబాదులో (రవీంద్ర భారతి); (ఆ) అమెరికాలో టాంపా నగరంలో; (ఇ) పిఠాపురం దగ్గరలోని విరవ గ్రామంలో మఱియు (ఈ) సింగపూరు నగరంలో అందరి ఆదర ప్రోత్సాహాలతో సుసంపన్నంగా, జయప్రదంగా జరుపుకున్నాము.
||
(అ) హైదరాబాదులో (రవీంద్ర భారతి) కృష్ణాష్టమి అనగా 2017 - ఆగస్టు, 14 సాయంకాలం నిర్వహించుకున్న సంబరాలలోముఖ్య అతిథులుగా అన్నమయ్య సంగీత కృతులపై పరిశోధనాత్మకంగా కృషిచేసిన పరమ భాగవతులు శ్రీ. అమరవాది వారు; భాగవత ఆణిముత్యాలు (IBAM) వ్యవస్థాపక అధ్యక్షులు, పరమ భాగవతులు శ్రీ మల్లిక్ పుచ్ఛావారు విచ్చేసి ఆశీర్వదించి సభను జయప్రదం చేసారు. చిత్రమాలిక ఈ పుట క్రింద భాగంలో ఉంచడం జరిగింది. పెద్దలు తమ అమూల్య సందేశాలు అందించారు.శ్రీ మల్లికి పుచ్ఛావారు హ్యూస్టను నుండి మానస సరోవర యాత్రకు వెళ్థూ హైదరాబాదు వచ్చి సమయం చిక్కించుకుని విచ్చేసి అనుగ్రహించారు.

మన చరణి భాగవతం ఒక క్రొత్త చరవాణి కొని దానిలో వేసి మన మల్లిక్ పుచ్ఛావారికి ఇచ్చి మానససరోవరం, గజేంద్ర ధామ్ ల వద్ద IBAM తో పాటు మన చరణి భాగవతం కూడా నివేదించమని, ఆవిష్కరించమని ప్రార్థించాము. వారు ఎంతో పెద్దమనసుతో వెంటనే అంగీకరించి తీసుకున్నారు. త్వరలో మన పోతన తెలుగు భాగవతం ఎక్కడ గజేంద్ర మోక్షణం జరిగిందో అ గజేంద్ర ధామ్ క్షేత్రానికి వెళ్తోంది అని సగర్వంగా మనవి చేస్తున్నాను.

తరువాత, తెలుగు భాగవతము "సవరణల పోటీ" విజేతలకు బహుమతులు, ధృవపత్రములు అందించడం జరిగింది. మఱియు, తెలుగులో భాగవతముపైన గానీ పోతన పైన గానీ పిహెచ్.డి లేదా ఎంఫిల్ (5వ పరిశోధన) చేసిన వారికి ఇవ్వడానికి ఉద్దేశించిన "భాగవతరత్న" బిరుదు పురస్కారము "ఆచార్య వీపూరి వేంకటేశ్వర్లు, ఎంఎ, పిహెచ్.డి" వారికి ప్రదానం చేయడము జరిగింది. అతిథులు వక్తలు తమ అమూల్య సందేశాలు ఇచ్చారు. సంగీత శిక్షకులు శ్రీమతి శ్రీవిద్య శిష్యులు తమ అమృత గాత్రంతో సభికులను ఆనంద పరిచారు.