పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సభలు సమావేశాలు : 2017 - చతుర్థ వార్షికోత్సవాలు, విరవ గ్రామం


2017 భాగవత జయంత్యుత్సవములు; కృష్ణాష్టమి;తెలుగుభాగవతం,ఆర్గ్ చతుర్థ వార్షికోత్సవములు.

(ఇ) కాకినాడ దగ్గరి విరవ గ్రామంలోని సంబరాల వివరాలు, ఆ చిత్రాలసరళి:-- ఈ ఏడాది ఉత్సవాలు నాలుగు కేంద్రాలలో (అ) హైదరాబాదులో (రవీంద్ర భారతి); (ఆ) అమెరికాలో టాంపా నగరంలో; (ఇ) పిఠాపురం దగ్గరలోని విరవ గ్రామంలో మఱియు (ఈ) సింగపూరు నగరంలో అందరి ఆదర ప్రోత్సాహాలతో సుసంపన్నంగా, జయప్రదంగా జరుపుకున్నాము.
(ఇ) తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురం దగ్గరలోని విరవ గ్రామంలోని, రామాలయ ప్రాంగణంలో భాగవత బంధువు రాజాచంద్ర అధ్వర్యంలో 2017 – ఆగస్టు, 20వ తారీఖు ఉదయం 10:00గంటలకు భాగవత జయంతి సంబరాలు గ్రామ పెద్దలు, బాలబాలికలు అందరూ బహు చురుకుగా, ఆనందంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లల బొమ్మల పోటీలో నెగ్గిన, పాల్గొన్న వారందరకి బహుమతులు, జయ పత్రాలు ఇవ్వడం జరిగింది.