పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సభలు సమావేశాలు : 2019 - బాగవతరత్న పురస్కారము

  శ్రీశ్రీశ్రీ అమృతానంద సరస్వతీ సంయమీంద్ర మహాస్వాములు, భాగవతరత్న ఎంపిక కార్యవర్గము అధ్యక్షులు, వారి దివ్య ఆదేశం మేరకు తెలుగు భాగవత ప్రచార సమితి వారు వికారి నామ సంవత్సరము (క్రీశ.2019)నకు "భాగవతరత్న పురస్కారం" డా. తాడేపల్లి వీరలక్ష్మి గారికి ప్రదానం చేసారు.


       

  భాగవతరత్న పురస్కారం ఎంపికకు ధరఖాస్తులు ఆహ్వానం 25-జనవరి, 2019న ప్రకటించబడింది. వచ్చిన ధరఖాస్తులు భాగవతరత్న 2019 ఎంపిక కార్యవర్గము సభ్యులు ఇద్దరు పండితులు విశ్లేషించి అభిప్రాయం తెలిపారు. అధ్యక్షులు శ్రీశ్రీశ్రీ అమృతానంద సరస్వతీ సంయమీంద్ర మహాస్వాములు వారు ఆదేశం అనుగ్రహించారు.
  తెలుగుభాగవత ప్రచార సమితివారు, భాగవత ధర్మాన్ని తెలుగువారిలో వ్యాపింపజేసేందుకై నెలకొల్పిన "భాగవతరత్న పురస్కారం", చైతన్య మహిళా మండలి, హనుమాన్ పేట వెల్ఫేర్ అసోసియేషన్ మఱియు అక్షరకౌముది సంయుక్త అద్వర్యంలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకలు సందర్భంగా 23-08-2109న డా. వీరలక్ష్మి వారికి ప్రదానం చేసి సత్కరించారు. తెలుగు అనుకూలించిన ఒక ఆండ్రాయిడు టాబ్ ను బహూకరించారు

  భాగవత రత్న డా. తాడేపల్లి వీరలక్ష్మి, ఎమ్ఎ (తెలుగు, సంస్కృతం, జ్యోతిషం), పిహెచ్ డి వారు శ్రీమదాంధ్ర మహాభాగవతము - మాతృహృదయము అను పరిశోధనాంశముతో, ఆచార్య మూలె విజయలక్ష్మి వారి పర్యవేక్షణలో, శ్రీపద్మావతీ మహిళా విశ్వనిద్యాలయము నుండి 2017వ సంవత్సరములో పిహెచ్ డి పట్టా పొందుటలో చేసిన విశిష్ఠ కృషికి చిరు గుర్తింపుగా "భాగవతరత్న పురస్కారం" ఎంపిక చేయడం జరిగింది. వీరు వృత్తిరీత్యా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయురాలు. వీరు సాహితీశ్రీ, మఱియు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు పొంది యున్నారు.