పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : శ్రీకృష్ణుఁ డు కొల్వుకూటమును ప్రవేశించుట

రిమదరక్తపంములచే మేనఁ
దొగెడు ఘర్మబిందువులును నరయ
రిమేను చిత్రవనాంబుద మనఁగ
రుదారఁ జూపట్టె నందంద చూడ;
దంతములుఁ దాను కామపాలుండు
భుశిఖరంబులఁ బొలుపొందఁ దాల్చి -
దారుణతర దండర యుగ్మ మనఁగ
గౌత మల్లరంము సొచ్చినిలువఁ
గోరి మల్లుల కెల్ల కులిశమై, ప్రజకు
ధారుణి నాథుఁడై, ల్లిదండ్రులకుఁ
సిబాలుఁడై యొప్పు, పంకజాక్షులకు
మాస్త్రుఁడై, వల్లవావళి కెల్లఁ
మాప్తుఁ డై, యతి ప్రతతికి నెల్లఁ
తత్వమూర్తి యై, బంధుసంతతికి
దైమై, రోహిణీనయుఁడుఁ దాను
నా విష్ణుఁ డరుదెంచె నందఱుఁ జూడ.
తులిత గంధపుష్పామోదితులును
తసౌఖ్యాఢ్యులఁ జారుభూషణుల
శ్రికీర్తి యుతుల, నాశ్రితకల్పతరులఁ
బ్రతిభటవనదావపావకసముల
దీర్ఘబాహుల, ఠిన విక్రముల
జాతనేత్రుల, సుదేవసుతుల,
నా రామకృష్ణుల, తులవిక్రముల.
నారూఢ నవయౌవనాంగులఁ జూచి -
భోరున జను లెల్లఁ బొగడఁగఁ గంసు
డావ మాలించి టఁ జూచు నంత;
కులయపీడంబుఁ గూల్చి తన్నర్థి
కులయం బంతయుఁ గొనియాడవచ్చు
రికామపాలుర నందంద కాంచి
తిరుగుడువడి గుండె దిగులొంది తాల్మి