పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : పాండవుల మహాప్రస్థానంబు

  •  
  •  
  •  

1-381-వ.

మఱియు దేశకాలార్థయుక్తంబులు, నంతఃకరణ సంతాప శమనంబులునయిన హరివచనంబులం దలంచి, చిత్తంబు పరాయత్తంబయియున్నది;"అని యన్నకుం జెప్పి నిరుత్తరుండై, నిరంతర హరిచరణారవిందచింతామలబుధియై, శోకంబు వర్జించి, సదా ధ్యాన భక్తివిశేషంబులం గామక్రోధాదుల జయించి, తొల్లి తన కుభయసేనా మధ్యంబున నచ్యుతుం డానతిచ్చిన గీతలు దలంచి, కాలకర్మ భోగాభినివేశంబులచేత నావృతంబయిన విజ్ఞానంబుఁ గ్రమ్మఱ నధిగమించి,హేతుమద్భావంబున శోకహేతు వహంకార మమకారాత్మకంబయిన ద్వైతభ్రమం బనియును, ద్వైతభ్రమంబునకుఁ గారణంబుదేహం బనియును, దేహంబునకు బీజంబు లింగంబనియును,లింగంబునకు మూలంబు గుణంబు లనియును, గుణంబులకు నిదానంబు ప్రకృతియనియును, ”బ్రహ్మాహ"మనియెడు జ్ఞానంబున లీనయై ప్రకృతి లేకుండుననియు, ప్రకృతి యడంగుటయ నైర్గుణ్యంబనియును నైర్గుణ్యంబువలనఁ గార్యలింగ నాశం బనియును, గార్యలింగనాశంబున నసంభవంబగు ప్రకృతింబాసి, క్రమ్మఱ స్థూలశరీర ప్రాప్తుండుగాక పురుషుండు సమ్యగ్భోగంబున నుండు ననియును నిశ్చయించి యర్జునుండు విరక్తుండై యూరకుండె; ధర్మజుండు భగవదీయమార్గంబు దెలిసి యాదవుల నాశంబు విని నారదువచనంబులం దలంచి నిశ్చలచిత్తుండై స్వర్గమార్గ గమనంబునకు యత్నంబు సేయుచుండె; నా సమయంబున.

1-382-క.

దువుల నాశము మాధవు
వియు విని కుంతి విమలక్తిన్ భగవ
త్పచింతాతత్పరయై
ముమున సంసారమార్గమునకుం బాసెన్.

1-383-వ.

ఇట్లు కంటకంబునం గంటకోన్మూలనంబు సేసి కంటకంబులు రెంటినిపరిహరించు విన్నాణి తెఱంగున యాదవ రూప శరీరంబునం జేసి యీశ్వరుండు లోకకంటకశరీరంబులు సంహరించి నిజశరీరంబు విడిచె; సంహారంబునకు నిజశరీర పరశరీరంబులు రెండు నీశ్వరునకు సమంబులు, నిజరూపంబున మెలంగుచు రూపాంతరంబులు ధరియించి క్రమ్మఱ నంతర్ధానంబు నొందు నటుని కైవడి లీలా పరాయణుండైన నారాయణుండు, మీన కూర్మాది రూపంబులు ధరియించుఁ బరిహరించు"నని చెప్పి, మఱియు నిట్లనియె.

1-384-క.

""ఏ దినమున వైకుంఠుఁడు
మేదినిపైఁ దాల్చినట్టి మేను విడిచినాఁ
డా దినమున నశుభప్రతి
పాక మగు కలియుగంబు ప్రాప్తం బయ్యెన్.

1-385-సీ.

లివర్తనంబునఁ గ్రౌర్యహింసాసత్య-
దంభకౌటిల్యాద్యర్మ చయము
పురముల గృహముల భూములఁ దమలోనఁ-
లుగుట దలపోసి రిపురమున
నుమని రాజవై ను మని దీవించి-
సింధుతోయకణాభిషిక్తుఁ జేసి
నిరుద్ధనందనుండైన వజ్రునిఁ దెచ్చి-
ధురఁ బట్టము గట్టి మతఁ బాసి

1-385.1-ఆ.

రుల హరుల భటులఁ గంకణాదికముల
మంత్రిజనుల బుధుల మానవతుల
ఖిల మయిన ధనము భిమన్యుసుతునకు
ప్పగించి బుద్ధి నాశ్రయించి.

1-386-వ.

విరక్తుండైన ధర్మనందనుండు ప్రాజాపత్యం బనియెడి యిష్టిఁ గావించి యగ్నుల నాత్మారోపణంబు సేసి నిరహంకారుండును నిర్దళితాశేష బంధనుండును నై సక లేంద్రియంబుల మానసంబున నడంచి ప్రాణాధీనవృత్తి యగు మానసంబునుఁ బ్రాణమందునుఁ, బ్రాణము నపానమందును, నుత్సర్గసహితం బయిన యపానము మృత్యువునందును, మృత్యువును పంచభూతంబులకు నైక్యంబైన దేహంబు నందును, దేహము గుణత్రయంబు నందును, గుణత్రయంబు నవిద్య యందును, సర్వారోపహేతువగు నవిద్యను జీవుని యందును, జీవుండయిన తన్ను నవ్యయం బయిన బ్రహ్మ మందును, లయింపంజేసి బహిరంతరంగ వ్యాపారంబులు విడిచి, నారచీరలు ధరియించి, మౌనియు, నిరాహారుండును, ముక్తకేశుండునునై; యున్మత్త, పిశాచ, బధిర, జడుల చందంబున నిరపేక్షకత్వంబున.

1-387-క.

చిత్తంబున బ్రహ్మము నా
వృత్తముఁ గావించుకొనుచు విజ్ఞానధనా
త్తులు దొల్లి వెలింగెడి
యుత్తరదిశ కేఁగె నిర్మలోద్యోగమునన్.

1-388-సీ.

అంత నాతని తమ్ము నిలపుత్త్రాదులు-
లిరాకచేఁ బాపర్ము లగుచుఁ
రియించు ప్రజల సంచారంబు లీక్షించి-
ఖిల ధర్మంబుల నాచరించి
వైకుంఠ చరణాబ్జ ర్తిత హృదయులై-
ద్భక్తినిర్మలత్వమునుఁ జెంది
విషయయుక్తులకుఁ బ్రవేశింపఁగా రాక-
నిర్ధూతకల్మష నిపుణమతులు

1-388.1-తే.

హుళవిజ్ఞానదావాగ్ని సితకర్ము
లైన యేకాంతులకు లక్ష్యమై వెలుంగు
ముఖ్యనారాయణస్థానమునకుఁ జనిరి
విగతరజమైన యాత్మల విప్రముఖ్య!

1-389-వ.

అంత విదురుండు ప్రభాసతీర్థంబున హరియందుఁ జిత్తంబు సేర్చి, శరీరంబు విడిచి, పితృవర్గంబుతోడ దండధరుం డగుటం జేసి నిజాధికారస్థానంబునకుం జనియె; ద్రుపదరాజపుత్రియుఁ బతులవలన నుపేక్షితయై జగత్పతియైన వాసుదేవు నందుఁ జిత్తంబు సేర్చి తత్పదంబు సేరె; నిట్లు.

1-390-క.

పాంవకృష్ణుల యానము,
పాండురమతి నెవ్వఁడైనఁ లికిన విన్నన్
ఖండితభవుఁడై హరిదా
సుండై కైవల్యపదము సొచ్చు నరేంద్రా!