పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సభలు సమావేశాలు : 2016, జనవరి - 01 పురస్కారం

విశాఖపట్నం – తే. 2016- జనవరి – 01.
ఆర్ష విజ్ఞాన పరిషత్ మరియు విశాఖ సారస్వత వేదిక సంయుక్త అధ్వర్యంలో పౌర గ్రంథాలయం, విశాఖపట్నంలో తేది 2016 జనవరి, 01 జయప్రదంగా జరిగిన, బ్రహ్మ శ్రీ చర్ల గణపతి శాస్త్రి గారి 105వ జయంత్యుత్సవ సభలో భాగవత గణనాధ్యాయి, వ్యవస్థాపక అధ్యక్షులు, “తెలుగుభాగవతం.ఆర్గ్” జాలగూడు, శ్రీ ఊలపల్లి సాంబశివ రావు గారిని శాలువాతో సత్కరించి, పంచెల చాపు, కండువా బహూకరించి, కళా ప్రపూర్ణ చర్ల గణపతి శాస్త్రి పురస్కార జ్ఞాపిక, పతకం ప్రదానం చేశారు. ఈ ఘన సత్కారానికి సభకు, సభాధ్యక్షులు శ్రీ కె. బి. ఎస్. శర్మ, అధ్యక్షులు, తెలుగు రథం గారికి, డా. ఎమ్. వి. వి. మూర్తి గారికి, అధ్యక్షులు, గీతం విశ్వవిద్యాలయం , ఆచార్య కె. మలయవాసిని, విశ్రాంత తెలుగు శాఖాద్యక్షులు, ఆంధ్ర విశ్వకళాపరిషత్ గారికి, డా. చర్ల మృదుల సోదరీమణులకు, చర్ల గణపతి శాస్త్రి పురస్కార గ్రహీత శ్రీ సిఎస్ రావు గారికి, సభాసదులకు భాగవత గణనాధ్యాయి సవినయ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు.”

ఈ సభ సంక్షిప్త విశేషాలు:
ఆర్ష విజ్ఞాన పరిషత్ మరియు విశాఖ సారస్వత వేదిక సంయుక్త అధ్వర్యంలో పౌర గ్రంథాలయం, విశాఖపట్నంలో తేది 2016 జనవరి, 01 సుసంపన్నమైంది ఈ కార్యక్రమం. చర్ల మృదుల విరచిత గీతామృతం పుస్తకావిష్కరణ. శ్రీ కోటా వేంకట లక్ష్మీ నరసింహం గారికి, శ్రీ సి. ఎస్. రావు గారికి కళా ప్రపూర్ణ చర్ల గణపతి శాస్త్రి పురస్కార ప్రదానం. మాతాజీ లలితానంద స్వామిని గారికి చర్ల సుశీల పురస్కార ప్రదానం.

ఈ ఉత్సవాల విశేషాలు:
ఆర్ష విజ్ఞాన పరిషత్ మరియు విశాఖ సారస్వత వేదిక సంయుక్త అధ్వర్యంలో కళా ప్రపూర్ణ, స్వాతంత్ర సమర యోధులు, గాంధేయవాది బ్రహ్మ శ్రీ చర్ల గణపతి శాస్త్రి గారి 105వ జయంత్యుత్సవ సభ బహు రంజకంగా, జయప్రదంగా విశాఖపట్నంలో తే. 2016 జనవరి 01వ తారీఖున జరిపించారు. విశాఖ పౌర గ్రంథాలయం, విశాఖపట్నం వేదికపై జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ కె. బి. ఎస్. శర్మ, అధ్యక్షులు, తెలుగు రథం సభను సుసమర్థంగా ఆహ్లాదంగా నడిపించారు. డా. ఎమ్. వి. వి. మూర్తి గారు, అధ్యక్షులు, గీతం విశ్వవిద్యాలయం, ఆచార్య కె. మలయవాసిని, విశ్రాంత తెలుగు శాఖాద్యక్షులు, ఆంధ్ర విశ్వకళాపరిషత్, శ్రీమతి ఆకొండి విమల, అధ్యక్షులు, ఆర్ష విజ్ఞాన పరిషత్తు అతిథులుగా పాల్గొని వేదికను అలంకరించారు. సభలో వక్తలు కళాప్రపూర్ణ బ్రహ్మ శ్రీ చర్ల గణపతి శాస్త్రి సాహితీ, సామాజిక సేవలు, ముఖ్యంగా ప్రసిద్ధమైన వారి రామాయణ గ్రంథం, వారి సంతానం వారి ప్రేరణను కొనసాగిస్తూ చేస్తున్న అద్భుతమైన సేవలు కొనియాడారు. జయప్రదంగా జరిగిన కార్యక్రమాలు

  • డా. ఎమ్. వి. వి. మూర్తి వారిచే డా. చర్ల మృదుల గారు రచించిన “గీతామృతం పుస్తకావిష్కరణ”.
  • పద్య పఠన ప్రహేళిక విజేతలైన బాలలకు బహుమతులు ప్రదానం. బాలల చేత గీత మృత పద్యాలు పఠనం.
  • శ్రీ మంగు శివ రామ ప్రసాద్, సాహితీ విశ్లేషకులచే “గీతామృతం పుస్తక పరిచయం”.
  • అవధాన కళాతపస్వి శ్రీ కోటా వేంకట లక్ష్మీ నరసింహం వారికి కళా ప్రపూర్ణ చర్ల గణపతి శాస్త్రి పురస్కార ప్రదానం (పరోక్షంలో)
  • మాతాజీ లలితానంద స్వామిని, వ్యవస్థాపకులు, గీతాశ్రమము, బెంగళూరు వారికి చర్ల సుశీల పురస్కార ప్రదానం
  • శ్రీ సి. ఎస్. రావుగారు, ఐ. ఇ. ఎస్ (రిటైర్డు), అధ్యక్షులు, ప్రజా స్పందన వారికి కళా ప్రపూర్ణ చర్ల గణపతి శాస్త్రి పురస్కార ప్రదానం
  • శ్రీ ఊలపల్లి సాంబశివరావు, వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగుభాగవతం.ఆర్గ్ జాలగూడు, తెలుగు భాగవత ప్రచార సమితి (ట్రస్టు) వారికి సత్కారం కళా ప్రపూర్ణ చర్ల గణపతి శాస్త్రి పురస్కార ప్రదానం