పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సభలు సమావేశాలు : 2017 - చతుర్థ వార్షికోత్సవాలు, టాంపా, అమెరిక


2017 భాగవత జయంత్యుత్సవములు; కృష్ణాష్టమి;తెలుగుభాగవతం,ఆర్గ్ చతుర్థ వార్షికోత్సవములు.

4annivarsary31అమెరికాలోని, టాంపా సంబరాల వివరాలు, ఆ చిత్రాలసరళి:-- ఈ ఏడాది ఉత్సవాలు నాలుగు కేంద్రాలలో (అ) హైదరాబాదులో (రవీంద్ర భారతి); (ఆ) అమెరికాలో టాంపా నగరంలో; (ఇ) పిఠాపురం దగ్గరలోని విరవ గ్రామంలో మఱియు (ఈ) సింగపూరు నగరంలో అందరి ఆదర ప్రోత్సాహాలతో సుసంపన్నంగా, జయప్రదంగా జరుపుకున్నాము.
(ఆ) అమెరికాలో టాంపా నగరంలోని, ప్లోరిడా హిందూ ఆలయ ప్రాంగణంలో భాగవత బంధువు మీనా బృందం అధ్వర్యంలో 2017 – ఆగస్టు, 19 సాయంకాలం;
తెలుగు వారు, భాగవత అభిమానులు అందరూ ఆ బాలగోపాలం కార్యక్రమానికి విచ్చేసి చురుగ్గా పాల్గొన్నారు, ముందుగా తెలుగు భాగవత పద్యాలు ముద్రించి పంచబడ్డాయి. తెలుగుభాగవతం గురించి వివరించడం జరిగింది. చక్కటి సంగీతాలతో, పాటలతో, కృష్ణ స్మరణలతో, పోతన తెలుగు భాగవత చర్చలతో పసందుగా జరిగింది. చిన్న పిల్లలే కాదు అమ్ముమ్మల పాటలు కూడా అలరించాయి. చక్కటి భోజన ప్రసాద వితరణ అందరూ ఆస్వాదించారు. పిల్లలు అందరికి అలంకరించిన చక్కటి వేణువు, నెమలి పింఛము అందించబడ్డాయి.